నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ పై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సర్కారు
- ప్రభుత్వం తరఫున కౌంటర్ వేసిన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి
- నిమ్మగడ్డ ఆరోపణలు నిజం కావని వ్యాఖ్యలు
- ఎన్నికలు సజావుగా జరిగేందుకే ఆర్డినెన్స్ తీసుకువచ్చామని వెల్లడి
ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం గవర్నర్ కు ఉందని, గవర్నర్ ఆమోదించాకే ఆర్డినెన్స్ ను తీసుకువచ్చామని తెలిపారు. గవర్నర్ ఆమోదించాక ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని ద్వివేది హితవు పలికారు. కాగా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీ హోదాలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ తమను సంప్రదించలేదని ప్రభుత్వం కౌంటర్ లో పేర్కొంది. అటు, కరోనా విషయంలోనూ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ సంప్రదించలేదని ద్వివేది వివరించారు. ఎన్నికలు వాయిదా పడినా కోడ్ కొనసాగుతుందని నిమ్మగడ్డ ప్రకటించడం సరికాదని తెలిపారు.