లాక్ డౌన్ ను ఉల్లంఘించిన పెళ్లికొడుకు, పెళ్లికూతురు... అరెస్ట్!
- గుజరాత్ లో లాక్ డౌన్ సమయంలో గుడిలో పెళ్లి
- 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ
ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది. పెళ్లి కోసం నవసారీ జిల్లాలోని ఓ గుడిలో పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. అక్కడున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కొత్త పెళ్లికొడుకు, పెళ్లికూతురు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా నవసారి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వీరందరిపైనా చట్టపరంగా చర్యలు తీసకుంటామని చెప్పారు. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉండబోతున్న సంగతి తెలిసిందే.