Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా 50వ సినిమా కూడా ఇంద్రగంటితోనే చేస్తాను: హీరో నాని

V Movie
  • ఇంద్రగంటితో రెండు హిట్లు కొట్టిన నాని
  • విడుదలకి సిద్ధమైన మూడో సినిమా
  • ఇంద్రగంటి పట్ల అభిమానం చాటుకున్న నాని  
నానీని హీరోగా నిలబెట్టిన దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరుగా కనిపిస్తాడు. ఆయన తెరకెక్కించిన 'అష్టాచెమ్మా' .. 'జెంటిల్ మేన్' నాని కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమాగా 'వి' రూపొందింది. నానీకి ఇది 25వ సినిమా కావడం విశేషం.

ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా థియేటర్లకు రాలేకపోయింది. ఈ రోజున ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భంగా నాని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.

'నా 25వ సినిమాను ఇంద్రగంటితో చేసినందుకు ఆనందంగా వుంది. నా 50వ సినిమాను కూడా ఆయన దర్శకత్వంలోనే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుడిగా ఇంద్రగంటి 25వ సినిమాలోనూ నేనే నటించాలని భావిస్తున్నాను' అంటూ ఆయన పట్ల తనకి గల ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.
Nani
Indraganti
V Movie

More Telugu News