అదనపు కట్నం కోసం సొంత భార్యనే కిడ్నాప్ చేసిన ఘనుడు
- హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఘటన
- భర్త వేధింపులతో తండ్రి వద్దకు వచ్చిన బాధితురాలు
- కిడ్నాప్ ను అడ్డుకున్న తండ్రికి తీవ్ర గాయాలు
2014లో రెండో కుమార్తె అస్మాను సల్మాన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంత కాలం భార్యతో బాగానే గడిపిన సల్మాన్... ఆ తర్వాత అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పిల్లలతో కలిసి తండ్రి వద్దకు వచ్చింది.
నిన్న తండ్రితో కలిసి ఆసుపత్రికి వెళ్తుండగా... స్నేహితులతో కలిసి వచ్చిన సల్మాన్ ఆమెను కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో కూతురును కాపాడేందుకు యత్నించిన షరీఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షరీఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.