పాపం కానిస్టేబుల్...మాస్క్ పెట్టుకోలేదని చితక్కొట్టిన అధికారి!
- ఎస్‌హెచ్‌ఓ, కానిస్టేబుల్ మధ్య వివాదం
- ఆ సందర్భంగా తనను కొట్టినట్టు కానిస్టేబుల్ ఆరోపణ
- ఢిల్లీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో ఘటన
దుర్గాచౌక్ వద్ద జోగేంద్ర అనే కానిస్టేబుల్‌తోపాటు మరికొందరు పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ ప్రకాష్ మాస్క్ ధరించని జోగేంద్రను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో ఎస్‌హెచ్‌ఓ తనను లాఠీతో తీవ్రంగా కొట్టినట్లు సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.