ప్రముఖ సినీ కథా రచయిత సీఎస్ రావు కన్నుమూత

  • హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచిన సీఎస్ రావు
  • చిరంజీవి తొలిచిత్రానికి కథ అందించిన సీఎస్ రావు
  • నవలా, నాటక రచయితగా ప్రస్థానం ఆరంభం
  • సినిమా రంగంలోనూ పేరుతెచ్చుకున్న వైనం
ప్రముఖ సినీ కథా రచయిత సీఎస్ రావు మృతి చెందారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఇవాళ హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. సీఎస్ రావు నవల, నాటక రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై సినీ రంగంలో ప్రవేశించి అనేక హిట్ చిత్రాలకు కథలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి చిత్రం ప్రాణంఖరీదు సినిమాకు కథ అందించింది సీఎస్ రావే. ఆయన కథ అందించిన ఊరుమ్మడి బతుకులు చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి అనేక చిత్రాలకు ఆయన కథా రచయితగా పనిచేశారు.

CS Rao
Demise
Tollywood
Story Writer

More Telugu News