రేపు 74 లక్షలకు పైగా ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ: కేటీఆర్
- లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో నిరుపేదలు
- మొత్తం రూ.1,112 కోట్లు కేటాయించామన్న కేటీఆర్
- ఆ మొత్తాన్ని ఇప్పటికే బ్యాంకులకు బదిలీ చేశామని వెల్లడి
లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మేర ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. అందుకోసం మొత్తం రూ.1,112 కోట్లు కేటాయిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఆయా బ్యాంకులకు బదిలీ చేశామని తెలిపారు.