విదేశీయుల వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
- కరోనా కారణంగా భారత్ లో చిక్కుకుపోయిన విదేశీయులు
- ఏప్రిల్ 30 వరకు వీసాల పొడిగింపు
- ఎలాంటి రుసుము వసూలు చేయబోమని వెల్లడి
విదేశీయుల వీసాలను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయడంలేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30వ తేదీ మధ్యలో గడువు తీరిపోయే అన్ని వీసాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని, విదేశీయులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏప్రిల్ 30 వరకు భారత్ లో ఉండొచ్చని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై తీవ్ర ఆంక్షలు ఉండడంతో అన్ని దేశాల ప్రజలు ఇతర దేశాల్లో నిలిచిపోయారు.