ప్రధానికి మరో లేఖ రాసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా
- ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ నిర్ణయం పట్ల హర్షం
- ఈ పథకాన్ని సెప్టెంబరు వరకు కొనసాగించాలని సూచన
- రేషన్ కార్డులు లేనివారికి 10 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాలని విజ్ఞప్తి
రేషన్ కార్డులు లేనివారికి కూడా 10 కిలోల ఆహార ధాన్యాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా కూలీల వద్ద ఆహార భద్రత కార్డులు ఉండే అవకాశం లేదని, వారికి కూడా ఆహారధాన్యాలు అందేలా చూడాలని సూచించారు. ఆహార ద్రవ్యోల్బణం రాకుండా చూసేందుకే ఈ సూచనలు చేశామని సోనియా తన లేఖలో వివరించారు.
రవాణా సమస్యలు ధరల పెరుగుదలకు కారణం కాకుండా చూడాలని, ఆహార పదార్థాలను రాష్ట్రాలకు విరివిగా అందించాలని కోరారు. ఇలాంటి విపత్కర సమయాల్లో ఉపయుక్తంగా ఉండేందుకు ఎఫ్ సీఐ నిల్వ సామర్థ్యం పెంపొందించే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.