ఆహారం కోసం తన్నుకుని, పునరావాస కేంద్రాన్ని తగలెట్టేశారు!
- న్యూఢిల్లీలోని కాశ్మీర్ గేట్ సమీపంలో ఘటన
- సిబ్బందిపై దాడి చేసిన వలస కార్మికులు
- యమునా నదిలో దూకి ఒకరి మృతి
ఆపై తమ తోటి కార్మికుని మృతికి షెల్టర్ జోన్ స్టాఫ్ కారణమంటూ, పలువురు నిరసనలకు దిగారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను తరలించగా, వారిపై రాళ్లు రువ్వారు. షెల్టర్ జోన్ ను తగులబెట్టిన కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ పునరావాస కేంద్రంలో దాదాపు 250 మంది వరకూ తలదాచుకుని ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, నదిలో మునిగి చనిపోయిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షెల్టర్ జోన్ కు నిప్పంటించిన తరువాత ఆ ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.