యూత్ లో అనన్య పాండేకి పెరుగుతున్న క్రేజ్
- హిందీలో కుదురుకుంటున్న అనన్య పాండే
- నాజూకుదనానికి ఫిదా అవుతున్న కుర్రకారు
- పూరి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనన్య
హిందీలో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఈ సుందరి, తెలుగులో పూరి జగన్నాథ్ సినిమాలో విజయ్ దేవరకొండ జోడీగా చేస్తోంది. ఈ అమ్మాయికి యూత్ లో వున్న క్రేజ్ ను గ్రహించిన దర్శక నిర్మాతలు, తమ సినిమాల్లో ఆమెను తీసుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా హిట్ కొడితే, తెలుగులో ఈ అమ్మాయి జోరు కొనసాగడం ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.