యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను తీసుకువస్తున్న ఫేస్ బుక్
- ఫేస్ బుక్ నుంచి క్వైట్ మోడ్ ఫీచర్
- యూజర్ల సమయ నియంత్రణ కోసం ఉపయుక్తం
- ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు మాత్రమేనన్న ఫేస్ బుక్
అంతేకాదు, క్వైట్ మోడ్ లో ఉన్నప్పుడు మీరు ఫేస్ బుక్ లోకి వెళ్లాలనుకుంటే వెంటనే మీకు హెచ్చరిక వస్తుంది. మీరు సెట్ చేసిన టైమ్ పూర్తయ్యే వరకు ఫేస్ బుక్ చూడడం కుదరదు అంటూ సందేశం వస్తుంది. సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ ఆరోగ్య విభాగం హెడ్ కాంగ్ జింగ్ జిన్ తెలిపారు. ప్రస్తుతానికి క్వైట్ మోడ్ ఫీచర్ ను ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ మే నెలలో అందుబాటులోకి వస్తుంది.