ఏపీలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలు వాయిదా.. ఉన్నత విద్యా మండలి ప్రకటన

AP EAMCET and other entrance tests postponed
  • లాక్ డౌన్ దృష్ట్యా వాయిదా వేస్తున్నాం
  • ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నిలిచిపోయాయి
  •   తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ప్రకటన
లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీలో పలు ప్రవేశ పరీక్షలను ఏపీ ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలన్నింటిని లాక్ డౌన్ దృష్ట్యా వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. లాక్ డౌన్ కారణంగా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, నిర్ణీత తేదీల్లో వాటి నిర్వహణ సాధ్యం కాదని తెలిపింది. ప్రవేశ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఉన్నత విద్యామండలి తన ప్రకటనలో పేర్కొంది.
Go Back to Shorts
Andhra Pradesh
EAMCET
postpone

More Telugu News