ఏపీలో క్వారంటైన్ లో ఉన్నవారికి బలవర్ధకమైన ఆహారం అందజేత
- ఏపీలో పలు చోట్ల క్వారంటైన్ కేంద్రాలు
- కోడిగుడ్లు, డ్రైఫ్రూట్స్ తో స్పెషల్ డైట్
- వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుందన్నది భావన
గన్నవరం, నూజివీడు, గంగూరు (విజయవాడ డివిజన్) క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అరటిపండ్లు, కోడిగుడ్లు, బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం వంటి బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నారు. ఈ తరహా ఆహారంతో క్వారంటైన్ లో ఉన్నవారికి వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుందన్నది వైద్యుల భావన. మొత్తమ్మీద కోడిగుడ్లు, డ్రైఫ్రూట్స్ లో స్పెషల్ డైట్ అందజేస్తున్నారు.