తెలంగాణలో ‘కరోనా’ క్రమంగా తగ్గుముఖం పడుతోంది: మంత్రి ఈటల

  • రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 471కి చేరింది
  • వీరిలో 45 మంది డిశ్చార్జి  కాగా, 12 మంది మృతి చెందారు
  • రేపు 60 నుంచి 70 మంది వరకు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది

తెలంగాణ రాష్ట్రంలో ‘కరోనా’ క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇవాళ నమోదైన కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 471కి చేరిందని, వీరిలో 45 మంది డిశ్చార్జి కాగా, 12 మంది మృతి చెందినట్లు వివరించారు.

రేపు 60 నుంచి 70 మంది వరకు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. మర్కజ్ కేసులు లేకపోయి ఉంటే తెలంగాణ ఇప్పటికే ‘కరోనా’రహిత రాష్ట్రంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇవాళ 665 నమూనాలను పరీక్షిస్తే కేవలం 18 మందికి మాత్రమే పాజిటివ్ ఉన్నట్టు వచ్చిందని చెప్పారు. ‘కరోనా’ బారిన పడ్డవారందరూ ఈ నెల 22 కల్లా కోలుకునే అవకాశం ఉందని చెప్పారు.



More Telugu News

Etela Rajender TRS Prime Minister Corona Virus