మెరుగుపడుతున్న బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం.. చికిత్సకు స్పందిస్తున్న బోరిస్
- గత నెలలోనే కరోనా బారినపడిన బోరిస్
- కోలుకుంటున్నారన్న ప్రధాని కార్యాలయం
- వెంటిలేటర్ సాయం లేకుండానే శ్వాస తీసుకుంటున్నారన్న మంత్రి
బోరిస్‌కు ప్రస్తుతం స్టాండర్డ్ ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్వర్డ్ అర్గర్ తెలిపారు. వెంటిలేటర్ సహాయం లేకుండానే ఆయన శ్వాస తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా, బోరిస్ గత నెలలోనే కరోనా బారినపడ్డారు. పది రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయనలో కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో ఆదివారం ఆసుపత్రికి తరలించారు.