తనయుడి పెళ్లి ఘనంగా చేయాలనుకున్న కుమారస్వామి.. అంతా తలకిందులైంది!
- ఈ నెల 17న కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహం
- కరోనా ప్రభావంతో ఇంట్లోనే వివాహ వేడుకను నిర్వహించాలని నిర్ణయం
- పెళ్లికి 20 మంది వరకు బంధువులు హాజరవుతారన్న కుమారస్వామి
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ముందు అనుకున్న విధంగా వివాహాన్ని నిర్వహించలేమని చెప్పారు. ఇంట్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించామని... ఈ వేడుకకు 15 నుంచి 20 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలిపారు. 17వ తేదీ శుభ దినమని... అందుకే పెళ్లిని వాయిదా వేయడం లేదని చెప్పారు. ఒక వేళ రానున్న రోజుల్లో పరిస్థితుల్లో మార్పు వస్తే... అప్పుడు మళ్లీ ఆలోచిద్దామని అన్నారు.
మరోవైపు, గత సార్వత్రిక ఎన్నికల్లో మండ్య పార్లమెంటు స్థానం నుంచి సినీ నటి సుమలతపై నిఖిల్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నిఖిల్ సినీ నటుడు కూడా. రెండు కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.