విజయ్ దేవరకొండను అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే టెన్షన్ గా వుంది :హీరోయిన్ అనన్య పాండే
- విజయ్ దేవరకొండ నాకు మంచి ఫ్రెండ్
- సెట్లో చాలా సాదాసీదాగా ఉంటాడు
- అందుకోసమే వెయిట్ చేస్తున్నానన్న అనన్య పాండే
ఇప్పటికే ముంబైలో ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా అనన్య పాండే మాట్లాడుతూ .. "విజయ్ దేవరకొండ తన స్టార్ డమ్ ను ఎంతమాత్రం చూపించడు. సెట్లో చాలా సాదాసీదాగా ఉంటాడు. తను నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఈ సినిమాతో నేను సౌత్ కి పరిచయమవుతున్నందుకు ఎంత ఆసక్తితో ఉన్నానో, విజయ్ దేవరకొండను బాలీవుడ్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయంలోను అంతే ఆత్రుతతో వున్నాను. మా ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా మరింత హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.