Narendra Modi: అప్పట్లో మన తల్లులు, సోదరీమణులు తమ ఆభరణాలను విరాళంగా ఇచ్చారు: కరోనా నేపథ్యంలో గుర్తు చేసిన మోదీ

modi on corona
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తమ పార్టీ కార్యకర్తలకు సందేశమిస్తూ మాట్లాడారు. 'మన తల్లులు, సోదరీమణులు గతంలో యుద్ధాలు జరిగిన సమయంలో వారి ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధ పరిస్థితుల కంటే తక్కువేం కాదు. మనుషులను రక్షించాల్సిన యుద్ధం ఇది. ప్రతి బీజేపీ కార్యకర్త పీఎం కేర్స్‌ ఫండ్‌కు సాయం చేయాలి. మరో 40 మందిని ఇదే పని చేసే విధంగా ప్రోత్సహించాలి' అని చెప్పారు.

'ఎక్కడికి వెళ్లినా మీ ముఖానికి మాస్కులు ధరించండి. మీ ఇంట్లో ఉన్నా ముఖానికి మాస్కులు ధరించే ఉండాలి. కరోనా కట్టడికి ప్రపంచం జపిస్తోన్న మంత్రం ఒక్కటే.. సామాజిక దూరం పాటించాలి, క్రమశిక్షణతో మెలగాలి. ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని గురించి ప్రజలందరికీ చెప్పాలి. ప్రతి ఒక్కరు 40 మందితో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చేయాలి. తమ చుట్టూ ఉన్న కరోనా బాధితుల గురించి దీని వల్ల వారికి తెలుస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ విషయాలను తెలుసుకోవడం ముఖ్యం' అని తెలిపారు.

'నిన్న రాత్రి 9 గంటలకు 130 కోట్ల మంది ఐక్యతను చూశాం. కరోనాపై జరుగుతున్న పోరాటంపై అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు తమ ఐక్యతను చాటారు. భారత్‌లాంటి అతి పెద్ద దేశంలో లాక్‌డౌన్‌ను ఇంతటి క్రమశిక్షణతో పాటిస్తున్నారు' అని అన్నారు.

'ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు. కరోనాను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రపంచానికి భారత్‌ ఉదాహరణగా నిలిచింది. ఈ వైరస్‌ తీవ్రత గురించి ముందుగానే అర్థం చేసుకున్న దేశాల్లో భారత్‌ ఒకటి. భారత్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని, శక్తి మేరకు అమలు చేస్తోంది' అని మోదీ తెలిపారు.
Go Back to Shorts
Narendra Modi
BJP
Corona Virus

More Telugu News