గుర్తింపు కార్డులు లేని సినీ కార్మికులకు ‘జార్జిరెడ్డి’ చిత్ర యూనిట్ సాయం
- లాక్ డౌన్ నేపథ్యంలో పేద సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
- 10 రోజులకు సరిపడా కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అందజేత:
- సామాజిక స్పృహతో వ్యవహరించాలి: నిర్మాత అన్నపురెడ్డి అప్పిరెడ్డి
జార్జిరెడ్డి చిత్ర నిర్మాతలు అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దామురెడ్డి, దర్శకుడు జీవన్ రెడ్డి తో పాటు ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన సందీప్, ఇతర నటులు తదితరులు సినీ కార్మికులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అందజేశారు. ఈ సందర్భంగా అన్నప్పురెడ్డి అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో తోటి వారికి సాయం చేయాలని, సామాజిక స్పృహతో వ్యవహరించాలని అన్నారు.