సంగారెడ్డిలో కొత్తగా ఆరుగురికి కరోనా
- చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు
- వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్
- కలెక్టర్ తో మంత్రి హరీశ్ రావు సమీక్ష
కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ఆరుగురి కుటుంబాల సభ్యులను అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. వారు ఎవరెవరిని కలిశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 100 దాటిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొత్త కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.