Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరోనాకు మందు కనిపెట్టామన్న 'డిస్ట్రిబ్యూటెడ్‌ బయో'... ఆరు నెలల్లోనే అందుబాటులోకి!

Distributed Bio Says Corona Vaccine Ready
  • సార్స్ ను నిర్వీర్యం చేసిన యాంటీ బాడీస్ పనిచేశాయి
  • ఎస్ - ప్రొటీన్ కణాలను అంతం చేస్తే కరోనా వైరస్ అంతం
  • సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం
కరోనా వైరస్‌ నుంచి మానవాళిని కాపాడే ఔషధాన్ని తాము తయారు చేశామని అమెరికాలోని, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న 'డిస్ట్రిబ్యూటెడ్‌ బయో' చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌ విల్లె వెల్లడించారు. గతంలో సార్స్‌ వైరస్‌ ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన యాంటీ బాడీస్‌ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని  ఆయన అన్నారు. ఐదుగురితో కూడిన తన బృందం కరోనా వైరస్‌పై విజయం సాధించిందని, సార్స్‌ ను అంతం చేసిన యాంటీ బాడీస్ కరోనాపైనా పని చేశాయని, డాక్టర్‌ జాకబ్‌ పేర్కొన్నారు.

వాస్తవానికి కరోనా వైరస్‌ మానవ శరీరంలోని ఎస్‌ - ప్రొటీన్‌ కణాల ద్వారా ప్రవేశిస్తుందని, తాము ప్రయోగించిన యాంటీ బాడీస్, ఎస్‌ - ప్రొటీన్‌ ను నిర్వీర్యం చేస్తున్నాయని, తద్వారా కరోనా వైరస్‌ కూడా నాశనం అవుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్న వాక్సిన్, సెప్టెంబర్‌ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశామని వెల్లడించారు. తమ ప్రయోగ ఫలితాలను మరో రెండు ల్యాబ్స్ సాయంతో నిర్ధారించుకుంటున్నామని జాకబ్ వెల్లడించారు.
Corona Virus
Vaccine
Distributed Bio

More Telugu News