కంటికి కనిపిస్తే దానిని కత్తితో పొడవచ్చు కానీ కనబడదు
ఆ దేవుడు సృష్టించిన పురుగు ఇది
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలను చైతన్య పరుస్తూ పలువురు కళాకారులు తమకు తోచిన స్టైల్ లో ముందుకెళ్తున్నారు. తాజాగా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ‘కరోనా’పై పాటతో ముందుకొచ్చారు. ‘అది ఒక పురుగు.. కనిపించని పురుగు.. కరోనా పురుగు..’ అంటూ వర్మ స్వయంగా పాడిన పాట వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. ఈ పాట ద్వారా ‘కరోనా’ ఎంత ప్రమాదకారో చెప్పిన వర్మ, తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రజలు ఆ వైరస్ బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు. మీరూ.. ఆ పాట వినండి..