అందులో నిజం లేదన్న పూజ హెగ్డే
- తమిళ సినిమాలకు సైన్ చేయలేదు
- ఆ ప్రాజెక్టులు ఓకే అయితే అదృష్టమే
- త్వరలో తానే చెబుతానన్న పూజ హెగ్డే
తాజాగా ఈ వార్తలపై పూజ హెగ్డే స్పందించింది. "హలో .. హలో మీరు తొందరపడకండి .. నేను ఇంతవరకూ ఏ తమిళ సినిమాకు సైన్ చేయలేదు. కొన్ని పెద్ద ప్రాజెక్టులైతే వచ్చాయి .. అవి కుదిరితే నేనే చెబుతాను. ఆ ప్రాజెక్టులు సెట్ అయితే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు" అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ సరసన .. అఖిల్ జోడీగా పూజ హెగ్డే చేసిన సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.