సావిత్రికి, నాకూ మధ్య ఎలాంటి మనస్పర్థలు ఉండేవి కాదు: షావుకారు జానకి
- సావిత్రి నేను కలిసి నటించాము
- మా మధ్య మంచి స్నేహం వుంది
- ఇదంతా పుకారు మాత్రమేనన్న షావుకారు జానకి
కథానాయికగా సావిత్రికి నప్పే పాత్రలు వేరు .. నాకు నప్పే పాత్రలు వేరు. సావిత్రి ఎలాంటి పాత్రలకైనా సరిపోతుంది. ఎటువంటి పాత్రలనైనా చేయగలుగుతుంది. ఆమెతో నేను ఎప్పుడూ పోటీపడలేదు .. పోటీపడాలని అనుకోనూ లేదు. సావిత్రిని చూసి నేను ఈర్ష్య పడినట్టుగా కొంతమంది ప్రచారం చేశారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఇదంతా కొంతమంది కావాలని చేసిన పుకారు" అని చెప్పుకొచ్చారు.