సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ మృతి... బోరున విలపించిన సల్మాన్!

Salman Nephew Abdulla Passes Away
  • కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న అబ్దుల్లా
  • చికిత్స పొందుతూ మృతి
  • విచారం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు
బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన, సోమవారం రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన సల్మాన్, "ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని అభిమానులకు చేరవేశారు. అబ్దుల్లా మరణ వార్తను విని ఆయన బోరున విలపించారు.

కాగా, అబ్దుల్లా మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా బాడీ బిల్డర్‌ అయిన అబ్దుల్లా, సల్మాన్‌ తో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిత్యమూ జిమ్ కు ఇద్దరూ కలిసే వెళ్లేవారు. గతంలో అబ్దుల్లాతో కలిసి జిమ్ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
Go Back to Shorts
Salman Khan
Abdullah Khan
Died
Nephew

More Telugu News