ముషారఫ్ కు ఊరట
స్వీయ ప్రవాసం వీడి, స్వదేశాన్ని సంస్కరించాలని భావించి భంగపడిన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు కాసింత ఊరట లభించింది. ఎన్నికల్లో పాల్గొని మళ్ళీ అధ్యక్ష పీఠం అధిరోహించాలని ఆశించిన ఆయనకు అక్కడి రాజ్యాంగ వ్యవస్థలు చెక్ పెట్టాయి. ముషారఫ్ వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. న్యాయమూర్తులను తొలగించిన వ్యవహారం, బేనజీర్ భుట్టో హత్య కేసుల్లో ముషారఫ్ కు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తన ఫార్మ్ హౌస్ లోనే రిమాండ్ ఖైదీగా ఉన్న ముషారఫ్ కు కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. భుట్టో హత్య కేసులో విచారణ జరుపుతున్న తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2007 డిసెంబర్ లో రావల్పిండి వద్ద ఓ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న భుట్టో ఆత్మాహుతి దాడిలో మరణించింది. ఈ వ్యవహారంలో ముషారఫ్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్ధేశపూర్వకంగానే ఆమె భద్రతా సిబ్బందిని తగ్గించారంటూ ముషారఫ్ పై కేసు నమోదైంది.