Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆచారి అమెరికా యాత్ర' ఆడదని నాకు ముందే తెలుసు: హీరో విష్ణు

Achari Amerika yatra Movie
  • నాకు చెప్పింది ఒకటి .. చేసింది ఒకటి 
  • ఎడిటింగ్ పరంగా చేసిన సూచనలు పట్టించుకోలేదు 
  • ఖర్చు పెట్టి చేసిన సాంగును వాడలేదన్న విష్ణు
ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా మంచు విష్ణు తన పనులను చక్కబెడుతున్నాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారితో 'ఆచారి అమెరికా యాత్ర' చేశాను. ఆ సినిమా షూటింగు అమెరికాలో జరుగుతుండగానే, నాకు తేడా కొట్టేసింది. మీరు నాకు చెప్పిన కథ ఒకటి .. మీరు చేస్తున్నది ఒకటి. షూటింగు ఆపేసి కరెక్ట్ చేసుకోండి అని చెప్పాను.

అలాగే రష్ చూసిన తరువాత ఈ సినిమా ఆడదని చెప్పాను. అంతకుముందు ఎవరో చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చకపోవడంతో, తమన్ తో చేయించాను. ఎడిటింగ్ పరంగా నేను ఇచ్చిన ఇన్ పుట్స్ కూడా తీసుకోలేదు. పైగా మరో సాంగ్ చేద్దామని అంటే కూడా, అనవసరమైన ఖర్చు వద్దని చెప్పాను. అయినా వినిపించుకోకుండా చేశారు .. కానీ ఆ సాంగును సినిమాలో ఉంచలేదు. చివరికి నేను చెప్పినట్టుగానే ఆ సినిమా ఫ్లాప్ అయింది .. ఆ తరువాత కాల్ చేసి 'నీ జడ్జిమెంట్ కరెక్ట్' అన్నారు అని చెప్పుకొచ్చాడు.
Vishnu
Nageshwar Reddy
Achari Amerika yatra Movie

More Telugu News