కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన పశ్చిమబెంగాల్ సింగర్ అరెస్టు

singer arrest in west bengal
  • ఓ వైద్యునికి వైరస్ సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ 
  • ఆమె సెలెబ్రిటీ కావడంతో వైరల్ 
  • వైరస్ సోకడం వాస్తవం కాకపోవడంతో చర్యలు తీసుకున్న పోలీసులు

కోల్ కతాలోని ఓ వైద్యునికి కరోనా వైరస్ సోకిందంటూ తప్పుడు ప్రచారం చేసిన అక్కడి ప్రముఖ సింగర్ ను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతాలోని బెలిఘటలోని ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా వైరస్ సోకిందంటూ పశ్చిమబెంగాల్ లో ప్రముఖ సింగర్, థియేటర్ గ్రూప్ నటిగా గుర్తింపు ఉన్న 29 ఏళ్ల మహిళ తప్పుడు పోస్టింగ్ సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. అయితే ఆ ఆసుపత్రి వైద్యులకుగాని, సిబ్బందికి గాని ఎవరికీ కరోనా సోకలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది.

కానీ ఈలోగానే ఆమె పెట్టిన పోస్టింగ్ వైరల్ కావడంతో సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి సదరు మహిళను అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో కరోనాపై వచ్చే తప్పుడు వార్తలు నమ్మొద్దని, పుకార్లు వ్యాప్తి చేయొద్దంటూ ప్రభుత్వం తరపున ఓ పాటపాడిన ఈ సింగరే ఇలా తప్పుడు ప్రచారానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

Go Back to Shorts
West Bengal
Corona Virus
singer
arrest

More Telugu News