ప్రియురాలి కోసం క్వారంటైన్ నుంచి పరారైన యువకుడు... ఇద్దర్నీ తీసుకువచ్చి క్వారంటైన్ లో వేసిన అధికారులు!
- తమిళనాడులో ఘటన
- ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన యువకుడు
- కరోనా అనుమానంతో క్వారంటైన్
- ప్రియురాల్ని కలవడంతో ఆమెకూ తప్పని క్వారంటైన్
అయితే, క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఆ యువకుడు విరహం భరించలేకపోయాడు. ప్రియురాలిని చూసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయాడు. దాంతో వైద్య సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ప్రియురాలి ఇంట్లో ఉన్న అతడిని గుర్తించారు. అతడు కరోనా అనుమానితుడు కావడంతో, ఆ యువతిని కలిసిన నేపథ్యంలో ఆమెకు కూడా కరోనా సోకుతుందేమోనన్న అనుమానంతో ఇద్దరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అంతేకాదు, క్వారంటైన్ నియమావళి ఉల్లంఘించాడంటూ ఈ యువకుడిపై కేసు నమోదు చేశారు.