గుంటూరు జిల్లా పొందుగల అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్తత
- తెలంగాణ నుంచి మళ్లీ విద్యార్థుల రాక
- అడ్డుకున్న పోలీసులు
- పోలీసులపై కొందరు యువకుల రాళ్లదాడి
పోలీసులు అడ్డుకోవడంతో కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు కొందరు యువకులకూ గాయాలయ్యాయి. అటు, ప్రత్యేక వైద్య బృందాలు పొందుగల చేరుకున్నాయి. వైద్య పరీక్షలు చేయించుకుని క్వారంటైన్ కు సిద్ధపడిన వారినే ఏపీలోకి అనుమతిస్తున్నారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి పొందుగలలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.