హీరో కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న పూజ హెగ్డే!
- అఖిల్ జోడీగా పూజ తాజా చిత్రం
- ప్రభాస్ సరసన చేస్తున్న సినిమా సెట్స్ పై
- చరణ్ సినిమాలోను దక్కిన ఛాన్స్
ప్రస్తుతం చేస్తున్న 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా కోసం కూడా పూజ భారీ పారితోషికాన్ని తీసుకుందని అంటున్నారు. సాధారణంగా హీరోయిన్ కంటే హీరోకి పారితోషికం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా కోసం అఖిల్ కంటే పూజ హెగ్డే అందుకున్న పారితోషికం ఎక్కువని అంటున్నారు. అఖిల్ కి వరుస పరాజయాలు పడటం .. పూజ వరుస విజయాలతో దూకుడు మీద ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న ఆమె, చరణ్ తోను ఓ సినిమా చేయనుందని అంటున్నారు.