మా ప్రజలందరినీ తన్ని బాధ్యతలు నేర్పించండి: నాగబాబు

nagababu about corona
  • ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది
  • మనం ప్రజలకి హక్కులు నేర్పాము, బాధ్యతలు నేర్పలేదు
  • ఇది అక్షర సత్యం.. ఈ తప్పు ప్రభుత్వం వారిదే 
కరోనా విజృంభణ నేపథ్యంలో ఒక ప్రొఫెసర్ టీవీలో చెప్పిన ఓ వ్యాఖ్య తనకు బాగా నచ్చిందని జనసేన నేత, సినీనటుడు నాగబాబు అన్నారు. ప్రజలందరికీ బాధ్యతలు కూడా నేర్పించాలని ఆయన ట్వీట్ చేశారు.

'ప్రైమ్ 9 న్యూస్ లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది. మనం ప్రజలకి హక్కులు నేర్పాము. బాధ్యతలు నేర్పలేదు అన్నారు. ఇది అక్షర సత్యం. ఈ తప్పు ప్రభుత్వం వారిదే. మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది. నేను కూడా అతీతుడ్ని కాదు. మా ప్రజలందరినీ తన్ని బాధ్యతలు నేర్పించండి. నేర్చుకుంటాం..' అని నాగబాబు చెప్పారు.
Go Back to Shorts
naga babu
Janasena
Tollywood

More Telugu News