కర్ర పట్టుకుని భార్య మందలింపు.. మరుగుదొడ్డి శుభ్రం చేసిన శిఖర్‌ ధావన్‌.. ఫన్నీ వీడియో

ఇంట్లో మరుగుదొడ్డి శుభ్రం చేస్తూ, బట్టలు ఉతుకుతూ భారత క్రికెట్ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ తీసుకున్న వీడియో వైరల్‌ అవుతోంది. కరోనా భయంతో క్రికెటర్లు ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య ఆయేషాతో కలిసి ధావన్ ఈ ఫన్నీ వీడియో తీసుకున్నాడు.

ఆమె కర్ర పట్టుకుని మందలిస్తుండగా ధావన్‌ ఆమెకు భయపడుతున్నట్లు నటిస్తూ ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ఫోనులోనూ మాట్లాడుతూ బిజీగా ఉన్నట్లు ఆయేషా కనపడుతుంది. అన్ని పనులు భర్తకు చెబుతూ ఆమె మేకప్‌ వేసుకుంటోంది.


More Telugu News