ఆధార్, పాన్ అనుసంధానం గడువు జూన్ 30 వరకు పొడిగింపు: నిర్మలా సీతారామన్
- కరోనా వ్యాప్తి నిరోధానికే లాక్ డౌన్ అని నిర్మల వెల్లడి
- ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు కొలిక్కి వచ్చిందన్న ఆర్థికమంత్రి
- పన్ను చెల్లింపుల ఆలస్య రుసుం తగ్గిస్తున్నట్టు ప్రకటన
2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్ ల దాఖలుకు 2020 జూన్ 30 గడువు అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుం 12 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు.
అంతేకాకుండా, టీడీఎస్ జమలో ఆలస్య రుసుం 18 నుంచి 9 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వివాద్ పే విశ్వాస్ పథకం గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నామని, పన్ను వివాదం మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగిస్తున్నట్టు చెప్పారు. మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్టీ రిటర్న్ ల దాఖలు గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ఆర్థికమంత్రి వివరించారు. కాంపోజిషన్ స్కీమ్ రిటర్న్ ల దాఖలుకు కూడా జూన్ 30 వరకు గడువు పెంచామని తెలిపారు.