కాసేపట్లో నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం

nirmala sitaraman on corona
  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే  నిర్మల మీడియా సమావేశం
  • లాక్‌డౌన్‌ పరిస్థితులు, ఆర్థిక అంశాలపై ప్రకటన ఉంటుంది
  • ట్వీట్‌ చేసిన కేంద్ర మంత్రి 
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాసేపట్లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలిసింది.

ఈ రోజు మధ్యాహ్నం  2 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో కీలక ప్రకటనలు చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. 'లాక్‌డౌన్‌ పరిస్థితులు, ఆర్థిక అంశాలపై ప్రకటన ఉంటుంది' అని ఆమె ట్వీట్ చేశారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలకు ప్యాకేజీ అధికంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Go Back to Shorts
Nirmala Sitharaman
Corona Virus
India

More Telugu News