కరోనా భయంతో రాష్ట్రాన్నే వదిలి వెళ్లిపోతే... కోటి రూపాయల లాటరీ తగిలింది!
- కేరళలో పని చేస్తున్న పశ్చిమ బెంగాల్ వాసి
- లాటరీ కొనుక్కుని, స్వగ్రామానికి
- బహుమతి రావడంతో ఆనందం
ఇటీవలి కాలంలో కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. కేరళలో ఉన్న సమయంలో ఇజారుల్ కొన్న ఓ లాటరీ టికెట్ కు కోటి రూపాయల బంపర్ బహుమతి తగిలింది. ఈ విషయం అతనికి గ్రామానికి వెళ్లిన తరువాతే తెలిసిందే. దీంతో తన జీవితమే మారిపోయిందన్న ఆనందంలో ఉన్నాడు అతను. తాను గ్రామానికి వచ్చిన సమయంలో భవిష్యత్తులో ఎంతో ఆందోళన ఉండేదని, కానీ లాటరీ వచ్చిందన్న విషయం తెలిసిన తరువాత చాలా సంతోషంగా ఉందని సంబరంగా చెబుతున్నాడు.