స్వీయ నిర్బంధంలో కోహ్లీ, అనుష్క స్వీట్ సెల్ఫీ... నెట్లో వైరల్
- సెల్ఫ్ ఐసోలేషన్లో ఒకరినొకరం మరింతగా ప్రేమించుకుంటున్నాం: అనుష్క
- కోహ్లీతో కలిసి దిగిన ఫొటో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
- కరోనా కట్టడికి ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని సూచించిన దంపతులు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని కోహ్లీ, అనుష్క ఇదివరకే వీడియో సందేశం ఇచ్చారు. తామిద్దరం స్వీయ నిర్బంధంలో ఉన్నామని చెప్పారు. ప్రజలు కూడా ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండిపోయి, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు.