చంద్రబాబు భయపడిందిక్కడే!: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు
- స్థానిక ఎన్నికల్లో టీడీపీ నుంచి డబ్బు తీసుకోవడానికి ఓటర్లు తిరస్కరించారు
- డబ్బు, మందు ఇవ్వకపోతే సింగిల్ డిజిట్ కే పరిమితమవుతామన్న ఆందోళన
- దీంతో చంద్రబాబు డ్రామాలు మొదలు పెట్టాడు
- నిమ్మగడ్డతో వాయిదా నాటకం ఆడించాడు
'స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఆశ చూపిన డబ్బు తీసుకోవడానికి ఓటర్లు తిరస్కరించారు. చంద్రబాబు భయపడిందిక్కడే. డబ్బు, మందు లేకుండా ఎలక్షన్లు జరిగితే జిల్లాల వారిగా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతామన్న ఆందోళనతో డ్రామాలు మొదలు పెట్టాడు. నిమ్మగడ్డతో వాయిదా నాటకం ఆడించాడు' అని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.