తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి శుభవార్త...ఉగాది కానుకగా శ్రీవారి లడ్డూలు ఉచితం
- 2 లక్షల లడ్డూలు అందజేయాలని నిర్ణయం
- దర్శనాలు నిలిపివేయడంతో పేరుకుపోయిన నిల్వలు
- వీటిని ఉద్యోగులకు అందజేయనున్న అధికారులు
కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల రాకను నిన్న మధ్యాహ్నంతో నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే దాదాపు రెండు లక్షల లడ్డూలను దేవస్థానం సిద్ధం చేసి ఉంచింది. తిరిగి ఆలయంలోకి భక్తుల ప్రవేశం ఎప్పుడన్నది కచ్చితంగా తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉన్న నిల్వలను సిబ్బందికైనా పంచిపెడితే వారు సంతోషిస్తారని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.