రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన మంత్రి బుగ్గన
- అప్రజాస్వామికంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు
- ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించలేదు
- సీఎస్ ను పిలిపించి మాట్లాడలేదు
కిషన్ సింగ్ తోమర్ కేసును ఎలక్షన్ కమిషన్ ఉటంకించిందని... అది ల్యాండ్ మార్క్ కేసే అయినప్పటికీ... దాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదని బుగ్గన అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని... ఎన్నికలకు కరోనా అడ్డంకి కాబోదని చీఫ్ సెక్రటరీ లేఖ రాసిన తర్వాత కూడా... చీఫ్ సెక్రటరీని ఎలక్షన్ కమిషనర్ పిలిపించి మాట్లాడలేదని చెప్పారు. ఏ ఉద్దేశంతో ఎన్నికలను వాయిదా వేశారో ఎస్ఈసీ చెప్పాలని డిమాండ్ చేశారు.