చంద్రబాబు హయాంలో రమేశ్ కుమార్ ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్నారు: సీపీఐ రామకృష్ణ
- ఎస్ఈసీకి కులం ఆపాదిస్తున్నారన్న రామకృష్ణ
- చంద్రబాబుతో రమేశ్ కుమార్ కు బంధుత్వం ఉందని ఆరోపిస్తున్నారని వెల్లడి
- వైసీపీ చర్యలే తమకు స్క్రిప్టు అని వ్యాఖ్యలు
సీఎంకు సలహాలు సూచనలు ఇచ్చే సలహాదారులు, ఐఏఎస్ అధికారులకు ఈ విషయం తెలుసని, అయితే వాళ్లు సీఎంకు సరైన సలహా ఇచ్చివుంటే జగన్ ఇంత దిగజారి మాట్లాడి ఉండేవారు కాదని అన్నారు. ఈ విషయంలో తామేదైనా మాట్లాడితే టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టును చదివి వినిపిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారని, వైసీపీ పాల్పడుతోన్న చర్యలే తమకు స్క్రిప్టు అని రామకృష్ణ స్పష్టం చేశారు.