Budda Venkanna: జగన్‌ గారు 'కరోనా' పేరు చెప్పి కోర్టుకు ఎగ్గొట్టారు: బుద్ధా వెంకన్న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. 'కరోనా పెద్ద విషయం కాదు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. థిస్ ఇస్ నిరంతర ప్రక్రియ అన్న జగన్‌ గారు కరోనా పేరు చెప్పి కోర్టుకు ఎగ్గొట్టారు. ఆయన ఆరోగ్యం బాగుంటే చాలు ప్రజలు పోయినా ఫర్వాలేదు అన్నట్టు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించారు' అని తెలిపారు.

'ఇప్పటికైనా కళ్లు తెరవండి కరోనా బ్లీచింగ్ పౌడర్, పారాసిటిమల్‌తో పోయేది కాదు' అని ఎద్దేవా చేశారు. కాగా, ఈ రోజు జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. విచారణకు పలువురు మాజీ అధికారులు మాత్రమే హాజరయ్యారు. 
Budda Venkanna
Telugudesam
YSRCP

More Telugu News