ఈ లేఖలు, లీకులు అందులో భాగమే: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on chandra babu naidu
  • చంద్రబాబునే ఇప్పటికీ కొందరు సీఎంగా ఊహించుకుంటున్నారు
  • వారు అకారణంగా భయభ్రాంతులకు గురవుతున్నారు
  • తమకు రక్షణ లేదని పీడ కలలు కనడంలో వింతేమీ లేదు
  • తమ యజమానికి ఏదో విధంగా సేవ చేయడానికి  తంటాలు  
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబునే ఇప్పటికీ సీఎంగా ఊహించుకునే వారు అకారణంగా భయభ్రాంతులకు గురవడం, తమకు రక్షణ లేదని పీడ కలలు కనడంలో వింతేమీ లేదు. తమ యజమానికి ఇప్పటికీ ఏదో విధంగా సేవ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. లేఖలు, లీకులు అందులో భాగమే' అని చెప్పారు.

కాగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే వారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News