నెల్లూరు బస్సులో ఒంగోలు బాధితుడు.. అప్రమత్తమైన అధికారులు
- హైదరాబాద్‌లో 20 మందితో బయలుదేరిన బస్సు
- వీరిలో ఆరుగురు నెల్లూరు వాసులు
- జిల్లాలో 793 మంది హోం ఐసోలేషన్‌లో
ఆ రోజు హైదరాబాద్ నుంచి 20 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. అయితే, నెల్లూరు చేరుకునేసరికి 16 మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఆరుగురు పట్టణానికి చెందినవారే కావడంతో వారిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. మిగతా వారి వివరాలను ఉన్నతాధికారులకు చేరవేశారు. జిల్లాలో మొత్తం 793 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఐదుగురిని మాత్రం ఐసోలేషన్ వార్డుకు తరలించారు.