వేడుకకు అతిథుల్ని పరిమితికి మించి అనుమతించారని... ఖమ్మంలో ఫంక్షన్ హాల్ సీజ్!

  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు విధించిన సర్కారు 
  • రెండు వందల మందికి మించకుండా అతిథులుండాలని ఆదేశం 
  • కార్యక్రమంలో సంఖ్య పెరగడంతో చర్యలు

ఓ శుభ కార్యక్రమంలో రెండు వందల మంది అతిథులకు మించి ఉండడంతో ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీఎన్ జీవోస్ ఫంక్షన్ హాల్ ను అధికారులు నిన్న సీజ్ చేశారు. పెళ్లయినా, పేరంటమైనా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఖ్య అంతా రెండు వందలకు దాటరాదని, అంతకంటే ఎక్కువ మందితో ఫంక్షన్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీచేసింది.

ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. అయితే ఈ నిబంధనలను అక్కడ వేడుక నిర్వహించిన నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో అధికారులు కఠినంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎవరికైనా ఈ నిబంధన కచ్చితంగా వర్తిస్తుందని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Go Back to Shorts
Khammam
Function hall
cliosed

More Telugu News