'కరోనా' నేపథ్యంలో ఆటవిడుపు.. సినీ తారలు ఇంట్లో ఇలా గడుపుతున్నారు!

bollywood stars in home
  • పెయింటింగ్‌ వేసిన సల్మాన్ ఖాన్
  • గిటారు నేర్చుకుంటున్న కత్రినా కైఫ్
  • కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు
కరోనా వైరస్ విజృంభణతో షూటింగులు వాయిదా పడడంతో సినీనటులు ఇళ్లకే పరిమితమై తమలోని ఇతర కళలను బయటపెడుతున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో కూర్చొని పెయింటింగ్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. బ్లాక్ స్కెచ్‌తో ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ముఖాలను గీశాడు. ఆయన వేసిన మోనోక్రోమ్ పెయింటింగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
                                
హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఇంట్లో కూర్చొని గిటార్ వాయించింది. మంచి పాట పాడుతూ గిటారు ప్లే చేసింది. అయితే, తాను పోస్ట్ చేసిన వీడియోలో సౌండ్‌ మాత్రం వినిపించలేదు. 'సాధనలో అభివృద్ధి సాధించాను. కొన్ని రోజుల్లో మ్యూజిక్ వినిపిస్తాను' అని చెప్పింది.

భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించింది. దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో షూటింగులతో పాటు విద్యా సంస్థలు, క్లబ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్ బంద్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Bollywood
Salman Khan
Corona Virus

More Telugu News