Ranga Reddy District: ఫ్యాన్సీ నంబర్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించిన వాహనదారు!

షార్ట్స్‌లో చూడండి

కొన్నది రేంజ్ రోవర్ కారు...అటువంటి కారుకు నంబర్ కూడా ఎంతో ఫ్యాన్సీగా ఉంటేనే అందం అనుకున్నాడో వ్యక్తి. అందుకే ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా దాదాపు రూ.9 లక్షలు వెచ్చించాడు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో నిన్న ఫ్యాన్సీ నంబర్ల కోసం అధికారులు వేలంపాట నిర్వహించారు.

ఇందులో భాగంగా టీఎస్ 07 హెచ్ ఈ 9999 నంబర్ కోసం ఔత్సాహికులు పోటాపోటీగా రంగంలోకి దిగారు. ఎట్టకేలకు శేరిలింగంపల్లి కొత్తగూడ అపర్ణ టవర్‌కు చెందిన గూడూరు శివరామకృష్ణ 8 లక్షల 66 వేల 116 రూపాయలకు వేలంలో నంబర్‌ను దక్కించుకున్నారు. జిల్లాలో ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత పెద్ద మొత్తం ఆదాయం రావడం ఇదే మొదటిసారని రవాణా శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజు వివిధ ఫ్యాన్సీ నంబర్లకోసం నిర్వహించిన వేలంపాటలో మొత్తం 11 లక్షల 39 వేల 641 రూపాయల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.

Go Back to Shorts
Ranga Reddy District
DTC
fancy number

More Telugu News