Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్' నుంచి తప్పుకోబోతున్న అలియా భట్?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన పూణె షెడ్యూల్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జంటగా బాలీవుడ్ నటి అలియా భట్ ను ఎంపిక చేశారు. పూణె షెడ్యూల్ కు ఆమె రావాల్సి ఉంది. అయితే, ఈ షెడ్యూల్ వాయిదా పడటంతో... ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

బాలీవుడ్ లోని బిజీ తారల్లో అలియా భట్ కూడా ఒకరు. దీంతో, ప్రతి సినిమాకు పక్కా ప్లానింగ్ తో ఆమె డేట్స్ ఇస్తుంటుంది. ఇప్పుడు రాజమౌళి చిత్రం వాయిదా పడటంతో... తర్వాతి రోజుల్లో ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయడం అలియాకు కష్టంగా మారిందట. ఒకవేళ ఈ చిత్రం నుంచి అలియా తప్పుకుంటే... ఆమె స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడంతో... ఆమె స్థానంలో ఒలీవియా మారిస్ ను ఎంపిక చేశారు.
Alia Bhatt
RRR Movie
Rajamouli
Junior NTR
Ramcharan

More Telugu News