Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారతీయ సంప్రదాయం ప్రకారం.. వినీ రామన్ తో ఆసీస్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ నిశ్చితార్థం!

Max Well Engagement with indian Girl
  • వినీ రామన్ తో నిశ్చితార్థం
  • భారతీయ సంప్రదాయంలో వేడుక
  • ఇండియన్ ను వివాహమాడిన రెండో ఆసీస్ క్రికెటర్ గా మ్యాక్స్ వెల్
ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్, ఐపీఎల్ లో ఆడుతూ అసంఖ్యాకంగా భారత అభిమానుల మద్దతును పొందిన గ్లెన్ మ్యాక్స్ వెల్, తాను మనసుపడిన భారతీయ వనితతో ఇటీవల ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నాడు. భారత సంతతికి చెంది ఫార్మా సిస్ట్ వినీ రామన్ ను చానాళ్లుగా ప్రేమిస్తున్న మ్యాక్స్ వెల్, అచ్చు భారతీయ సంప్రదాయంలో ఈ వేడుకకు హాజరయ్యాడు. కుర్తా పైజమాను మ్యాక్స్ వెల్ ధరించగా, అతని బంధువులు కూడా భారతీయ సంప్రదాయ దుస్తులనే ధరించారు. ఇక, రామన్, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో గాగ్రా చోళీ ధరించింది.

ఇక భారత యువతిని పెళ్లాడే రెండో ఆసీస్ క్రికెటర్ గా మ్యాక్స్ వెల్ నిలవనున్నాడు. గతంలో ఆసీస్ పేసర్ షాట్ టైట్ సైతం ఇండియన్ గర్ల్ ను మనువాడిన సంగతి తెలిసిందే. 2014లో ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన షాన్ టైట్ మఘామ్ సింఘాతో ప్రేమలో పడి, ఆపై ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.
Glen Maxwell
Engagement
Indian Girl
VV raman

More Telugu News